లోట‌స్ పాండ్‌లో ష‌ర్మిల‌తో ఆ ఇద్ద‌రు భేటీ

VUYYURU SUBHASH
తెలంగాణ‌లో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి కొత్త పార్టీ ఏర్పాటు ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే రాజ‌కీయాలు వేడెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప‌లువురు కీల‌క నేత‌లు , టీఆర్ఎస్ పార్టీ నేత‌ల వార‌సులు కూడా వ‌చ్చి ష‌ర్మిల‌ను క‌లుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయ రంగాల‌తో సంబంధం లేని వారు ష‌ర్మిల ను క‌లుస్తున్నారు. తాజాగా ఈ రోజు లోట‌స్ పాండ్ లో వైఎస్ ష‌ర్మిలను సానియామీర్జా సోదరి ఆనం మీర్జా తో పాటు అజారుద్దిన్ త‌న‌యుడు మ‌హ్మ‌ద్ అస‌దుద్దిన్ కూడా క‌లిశారు. వీరిద్ద‌రు త‌మ భేటీకి రాజ‌కీయాల‌కు సంబంధం లేద‌ని.. మ‌ర్యాద పూర్వ‌క‌భేటి అని  ఆనంమీర్జా,అస‌దుద్దిన్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: