హైదరాబాద్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పోటాపోటీ సాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ప్రొఫెసర్ కోదండరాం వెనుకంజలో ఉన్నారు. అంతే కాకుండా ఆయన ఏకంగా మూడో స్థానంలో ఉన్నట్టు సమాచారం. నల్లగొండలో తొలిరౌండ్ ముగియగా.. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ముందంజలో ఉన్నారు.
మొత్తం 56 వేల ఓట్లలో ఆయనకు 15,990 ఓట్లు వచ్చాయి. అయితే స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న 12,567 ఓట్లతో ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. టీజేఎస్ అభ్యర్థి కోదండరాం 9 వేలకు పైగా ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. చెల్లని ఓట్లు 3వేల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్, చెరుకు సుధాకర్,
రాణి రుద్రమ ఉన్నారు.