ఆ మునిస‌ప‌ల్ చైర్మ‌న్‌ను డిసైడ్ చేసేది టాసే..

VUYYURU SUBHASH
క‌డ‌ప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇక్కడ అధికార వైసీపీకి కొంత అనుకూలంగా పరిస్థితులు కన్పిస్తున్నాయి. మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా 11 చోట్ల వైసీపీ, 12 చోట్ల టీడీపీ, ఒకచోట జనసేన అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఇక్క‌డ వైసీపీకి ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు ఎక్స్ అఫీషియోగా ఉన్నాయి. దీంతో వైసీపీ బలం 13కు చేరుకుంది. ఒకవేళ జనసేన అభ్యర్థి టీడీపీకి మద్దతు తెలిపితే టీడీపీ బలం కూడా 13కు చేరుకుంటుంది. అదే జ‌రిగితే ఇక్క‌డ మునిసిప‌ల్ చైర్మ‌న్‌ను డిసైడ్ చేసేందుకు టాస్ వేయాల్సి ఉంటుంది. అయితే జ‌న‌సేన అభ్య‌ర్థి ఎవ‌రికి మ‌ద్ద‌తు ప‌లుకుతారు ? అన్న‌ది మాత్రం స‌స్పెన్స్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: