నేడు తెలంగాణలో జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు..!!

KISHORE
 నేడు తెలంగాణలో జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలలో 52,389 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈనెల 18వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు ఆరు సెషన్‌లలో విద్యార్ధులు పరీక్ష రాయనున్నట్లు జేఈఈ మెయిన్‌ సిటీ కోఆర్డినేటర్‌ టి.లలితకుమారి తెలిపారు. పరీక్ష సమ యానికి ఆరగంట ముందు వరకు విద్యార్ధులను పరీక్ష కేంద్రం లోకి అనుమతిస్తారు.

అలస్యంగా వచ్చిన విద్యార్థుల కు అనుమతి ఉండదని తెలిపారు.  రెండో విడత పరీక్షల కు కొన్ని కేంద్రాలలో ఫేస్‌ ఐడెంటిఫికేషన్‌ కోసం ప్రత్యే కంగా ఎన్‌టీఏ రిప్రజేంటిటివ్స్‌ తోపాటు అబ్జర్వర్లు విధు లు నిర్వహించనున్నట్లు తెలిపారు. కరోనా నిబంధనల మేరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు సిటీ కోఆర్డినేటర్‌ టి.లలితకుమారి తెలిపారు. ఇక  తెలంగాణ వ్యాప్తంగా 12 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ లాంటి అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవే శాల కోసం జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామి నేషన్‌ (జేఈఈ) పరీక్షలు నిర్వహించే సంగతి తెలిసిందే. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: