బ్రేకింగ్‌: ఆ ఒక్క మున్సిపాల్టీలో మాత్ర‌మే టీడీపీ జోరు

VUYYURU SUBHASH
ఏపీలో జ‌రుగుతోన్న మున్సిపోల్స్ కౌంటింగ్‌లో టీడీపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒకే ఒక్క చోట మాత్ర‌మే స‌త్తా చాటుతోంది. ప్ర‌కాశం జిల్లా అద్దంకి మున్సిపాలిటీలో మాత్రమే గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పటి వరకూ జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో ఎక్కడా టీడీపీ సరైన పోటీ ఇవ్వలేదు. కానీ అద్దంకి మున్సిపాలిటీలో మాత్రం ఏడు వార్డుల్లో వైసీపీ, ఏడు వార్డుల్లో టీడీపీ విజయం సాధించాయి. మరో ఐదు చోట్ల కౌంటింగ్ జరుగుతుంది. అక్క‌డ నుంచి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. 71 మున్సిపాలిటీల్లో ఒక్క అద్దంకి మున్సిపాలిటీలోనే వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇవ్వగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: