బ్రేకింగ్‌: గుంటూరు టీడీపీ కీల‌క నేత‌పై కేసు

VUYYURU SUBHASH
ఏపీలో మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వేళ ప‌లు చోట్ల కీల‌క నేత‌ల‌పై కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే గుంటూరు జిల్లాలో ఓ కీల‌క నేత‌పై కేసు న‌మోదు అయ్యింది. జిల్లాలోని 42 డివిజన్ టీడీపీ అభ్యర్థి బుజ్జిపై  హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. 42 డివిజన్‌లో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలో పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. బుజ్జితో పాటు డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఉదయ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తిలపై కేసులు నమోదు అయ్యాయి. మాజీ ఎంపీ మోదుగుల వాహనాలపై దాడి చేశారని  వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కాగా వైసీపీ నేతలపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంపై టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: