కరోనా.. ప్రస్తుతం ఈ పేరు కన్న డేంజర్స్ పదం మరోకటి లేదు. నువ్వు ఎవరైతే నాకేంటి అన్నట్టే ఉంది ఇప్పుడు కరోనా పరిస్థితి చూస్తుంటే. ఎవ్వర్నీ వదిలిపెట్టడం లేదు. అవకాశం దొరికినవారికల్లా వ్యాప్తి చెందుతూ తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. భారత్‌లో రెండో దశ కరోనా తీవ్రతరమవుతోన్న పరిస్థితే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 18,599 మందికి కరోనా సోకింది. నిన్నటి వరకు రోజుకు 18 వేలుగా నమోదు అయిన కేసులు ఈ రోజు 24 గంటల్లోనే ఏకంగా 18500 కు చేరుకున్నాయి. ఇది ప్రజలను తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. చిన్న-పెద్ద, కుల-మతం, సామాన్యుడు-సెలబ్రిటి ఇలా ఏ తేడా లేకుండా అందరి ప్రాణాలను బలి తీసుకుంటుంది.
ఇప్పటికే పలు రంగాలకు చెందిన, పలువురు సెలబ్రిటిలు ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డగా.. తాజాగా తెలంగాణలో మరో మంత్రి కరోనాబారిన పడ్డారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు కోవిడ్ సోకినట్లు తేలింది. జ్వరంతో బాధపడుతున్న ఆమెలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించగా, వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె హైదరాబాదులోని యశోద ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆమె విస్తృతంగా పాల్గొంటున్న విషయం తెలిసిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: