హిందూపురంలో బాల‌య్య‌కు ఘోర అవ‌మానం

VUYYURU SUBHASH
ప్ర‌ముఖ సినీన‌టుడు,  హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో రోజు రోజుకు ప‌ట్టు త‌గ్గుతూ వ‌స్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న 38 పంచాయ‌తీల‌కు 30 స్థానాల్లో వైసీపీ మ‌ద్ద‌తుదారులు విజ‌యం సాధించారు. ఇక తాజాగా జ‌రుగుతోన్న హిందూపురం మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను సైతం బాల‌య్య ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఇప్ప‌టికే అక్క‌డ పార్టీ త‌ర‌పున బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌లేక‌పోయారు. ఇక తాజాగా ఆయ‌న ప్ర‌చారం కూడా ప్లాప్ అయ్యింది. బాలకృష్ణ చేపట్టిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనం లేక  రోడ్ షో వెలవెలబోయింది. రోడ్‌‌ షోలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో బాలయ్య అసహనానికి గురయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: