భార‌త్‌లో మ‌ళ్లీ క‌రోనా కోర‌లు... భ‌య‌పెడుతోన్న లెక్క‌లు

VUYYURU SUBHASH
కొంత కాలంగా స్త‌బ్దుగా ఉన్న క‌రోనా భార‌త్‌లో ఇప్పుడు మ‌ళ్లీ విజృంభిస్తోంది. ఇక్క‌డ కరోనా కేసుల సంఖ్య కొంత పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 13,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 101 మంది మరణించారు. ఇటీవ‌ల కాలంలో ఇంత ఎక్కువ సంఖ్య‌లో క‌రోనా కేసులు అయితే రాలేదు. తాజా కేసుల‌తో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,77,387 కు చేరుకుంది.

ఇప్పటి వరకూ కరోనా దెబ్బ‌తో భార‌త్‌లో 1.56 ల‌క్ష‌ల మంది మృతి చెందారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,127 గా ఉంది. 1,06,78,048 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా లెక్క‌లు చూస్తుంటే ప్ర‌జ‌ల్లో క‌రోనా ప‌ట్ల భ‌యం పోవ‌డంతో పాటు జాగ్ర‌త్త‌లు కూడా పాటించ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఈ లెక్క‌లు ప్ర‌జ‌ల్లో మ‌ళ్లీ భ‌యాందోళ‌న‌లు క‌లుగ చేస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: