వైసీపీ కీలకనేతకు షాక్.. నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ ఘనవిజయం
టీడీపీ మద్దతు అభ్యర్థి భాగ్యరత్నకు 6153 ఓట్లు, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్థన్‌రెడ్డి మద్దతుతో పోటీ చేసిన కె.శారదమ్మకు 5481 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ ఎమ్మెల్యే సుధాకర్‌కు, ఇన్చార్జ్ హర్షవర్థన్ రెడ్డికి పొసగట్లేదు. దీంతో ఎమ్మెల్యే సుధాకర్ మద్దతుతో పోటీ చేసిన సుశీలకు 1137 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యే మద్దుతో పోటీ చేసిన సుశీలకు 1137 ఓట్లు రాగా.. వైసీపీ 672 ఓట్లతో ఓడింది. పట్టణంలో 20 వార్డులు ఉండగా.. వైసీపీ మద్దతుదారులు 12, టీడీపీ మద్దతుదారులు 6 గెలుచుకున్నారు. సీపీఐ మద్దతుతో 1, ఎమ్మెల్యే వర్గం నుంచి 1 స్థానంలో గెలిచారు