మాజీ మంత్రి ఇలాకాలో సైకిల్ జోరు... ఫ్యాన్ బేజారు

VUYYURU SUBHASH
ఏపీలో తొలి ద‌శ స్థానిక ఎన్నిక‌ల‌తో పాటు రెండో ద‌శ ఎన్నిక‌ల్లోనూ వైసీపీ ఫుల్ స్వింగ్‌లో దూసుకు పోతోంది. టీడీపీకి చెందిన మ‌హామ‌హుల నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆ పార్టీకి ఎదురు లేదు. అయితే ఓ మాజీ మంత్రి ఇలాకాలో మాత్రం సైకిల్ జోరు ముందు ఫ్యాన్ పార్టీ పూర్తిగా బేజారు అయ్యింది. ఆ నియోజ‌క‌వ‌ర్గం ఏదో కాదు విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి. బొబ్బిలి నియోజకవర్గంలో  తెలుగుదేశం విజయపరంపర కొన‌సాగిస్తోంది. ప‌లు పంచాయ‌తీల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి ప‌రులు ముందంజలో దూసుకుపోతున్నారు. ఇంతవరకు విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 15 మంది కాగా.. ప‌లు కీల‌క పంచాయ‌తీల్లో  ఆ పార్టీ అభ్య‌ర్థులు ఆధిక్యంలో దూసుకు పోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: