టీడీపీ గెలుస్తుందని జోస్యం.. వైసీపీ దెబ్బకు సూసైడ్ అటెంప్ట్ ?
ఏపీలో తొలిదశ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఎన్నికల కౌంటింగ్ కూడా మొదలయింది. ఈ సమయంలో విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గరివిడి మండలం కోడూరు గ్రామానికి చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తి రాజకీయ కారణాలతో ఆత్మహత్య ప్రయత్నం చేశారు. వైసీపీ ఓడిపోతుంది అని గ్రామంలో జోశ్యం చెప్పిన కారణంగా వైసీపీ నేతలు వేదిస్తున్నారని ఆ కారణంగానే అప్పలనాయుడు ఆత్మహత్య ప్రయత్నం చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఆత్మహత్య యత్నానికి పాల్పడిన అప్పలనాయుడు పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. దీంతో అప్పలనాయుడును టిడిపి పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పరామర్శించారు. ప్రస్తుతం ఆయన విజయనగరం వెంకటరామ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ఐసియు విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో ఆయనను పరామర్శించిన కిమిడి నాగార్జున మాట్లాడుతూ అప్పల నాయుడు కు ఏదైనా జరిగితే, దానికి రాష్ట్రప్రభుత్వానిదే బాధ్యతని పేర్కొన్నారు.