వైసీపీ ఎంపీకి షాక్.. సొంత ఊళ్లో టీడీపీకి సర్పంచ్ ఏకగ్రీవం
కర్నూలు మండలం పి. రుద్రవరంలో టీడీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఎంకే మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో మొత్తం 10 వార్డుల్లో 1,154 ఓటర్లున్నారు. సర్పంచ్ స్థానాలకు ఐదుగురు నామినేషన్ దాఖలు చేయగా చివరకు నలుగురు పోటీ నుంచి తప్పుకోవడంతో మధు ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆయన గెలుపును ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మధు కూడా ఎంపీ గోరంట్ల మాధవ్‌కు బంధువు తెలుస్తోంది.