యూపీలో భారీ అగ్నిప్రమాదం..!
గంటపాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. భారీగా మంటలు చెలరేగటంతో ఆస్తి నష్టం ఏర్పడింది. అదృష్టవశాత్తూ ఘటన స్థలం ఎవరూ లేని కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. కాగా, ఖర్ ఖైదా పరిధిలోని జాహిద్ పూర్ కు చెందిన కొంతమంది అక్రమంగా గుడిసెలు వేసుకుని ఇక్కడ ఉంటున్నారు. గోదాములో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో పోలీసులు వీరిపై అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కేసు విచారణలో ఉందని ప్రమాదానికి గల కారణాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.