ఏపీలో ఎన్నికలకు మేము రెడీ... ఏపీ ఎన్నికల సంఘం...!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మేం సిద్ధం అని ఏపీ ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఎస్ఈసీ.. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీని హైకోర్ట్ వివరాలు అడిగింది. కరోనా తగ్గుముఖం పట్టినందున ఎన్నికలు నిర్వహణకు సిద్ధం అని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కాగా మార్చ్ లో కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది ఆగిన సంగతి తెలిసిందే.