దుబ్బాక పోరు: బీజేపీ అభ్యర్థి బావమరిది వద్ద రూ. కోటి స్వాధీనం

N.ANJI
దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎల్లుండి అనగా నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుకుండా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులోని బేగంపేటలో రూ.1 కోటి హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కాగా డబ్బును తీసుకెళ్తున్న వ్యక్తి సురభి శ్రీనివాసరావు దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుకు స్వయానా బావమరిది కావడం సంచలనం సృష్టిస్తుంది. కాగా శ్రీనివాసరావును, డ్రైవర్ రవికుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 బేగంపేటలోని విశాక ఇండస్ట్రీస్ సంస్థ మేనేజర్ నుంచి ఆ డబ్బును తీసుకుని దుబ్బాక వెళుతున్నట్టు శ్రీనివాసరావు పోలీసులకు తెలిపాడు. విశాక ఇండస్ట్రీస్ సంస్థ పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌కు చెందిందని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. కాగా ఇటీవలే సిద్ధిపేటలో రఘునందన్ మామ, ఇతర బంధువుల నివాసాల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి విధితమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: