నూతన్ నాయుడు మళ్ళీ అరెస్ట్...!

విశాఖలో నూతన్ నాయుడు శిరోముండనం చేసిన తర్వాత పడుతున్న బాధలు ఆ దేవుడికే తెలుసు అంటున్నారు ఆయన సన్నిహితులు. చేసిన తప్పుతో పాటుగా మరికొన్ని వ్యవహారాలు కూడా ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా మరోసారి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీలో నూతన్ నాయుడు ఉన్నాడు అని విశాఖ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

చీటింగ్ కేసులో అతన్ని అదుపులోకీ తీసుకున్న పోలీసులు... రిమాండ్ కి తరలించి విచారిస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని దళిత యవకుడు నుంచి డబ్బు తీసుకుని మోసం చేసాడు నూతన్ నాయుడు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్ లో నూతన్ నాయుడు భార్య  మధు ప్రియ ఉంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి నుంచి వారు డబ్బులు వసూలు చేసారు. శిరోముండనం కేసులో కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: