లిక్కర్ షాప్ కి ఉన్న అనుమతి ఆలయాలకు ఎందుకు లేదో..!

Lokesh
భక్తుల కోసం మహారాష్ట్రలోని అన్ని మందిరాలను తెరవాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ముంబయిలోని సిద్ధివినాయక ఆలయం వద్ద ఆ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటి గుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు బిజేపి శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపుచేసేందుకు పార్టీ నాయకుడు ప్రసాద్ లాద్​ సహా కొంత మంది బిజేపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.



మహారాష్ట్రలో లిక్కర్ షాపులకు అనుమతిచ్చిన ప్రభుత్వం ఆలయాలను మాత్రం ఎందుకు తెరవడం లేదని బిజేపి నేత ప్రవీణ్​ దరేకర్ ప్రశ్నించారు. మానసిక ప్రశాంతత కోసం ఆలయానికి వెళ్లే వారిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మందిరాలపై ఆధారపడి జీవించే చిరు వ్యాపారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: