కీలక వ్యాఖ్యలు చేసిన కేటిఅర్...!

తెలంగాణా అసెంబ్లీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. సిఎం కేసీఆర్, మంత్రి కేటిఅర్, మరో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బిల్లులను ప్రవేశ పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే మున్సిపల్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్. కీలక వ్యాఖ్యలు చేసారు.

మొత్తం 5 సవరణలు చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. 50 శాతం సీట్లలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ చట్టసవరణ చేసామని ఆయన అన్నారు. బడ్జెట్ లో హరితహారనికి 10 శాతం నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.  అయితే ఈ సవరణల విషయంలో బిజెపి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ  టార్గెట్ గా  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: