రేప్ బాలిక శవాన్ని రెండు నెలల తర్వాత సమాధిలో నుంచి తీసారు...!

దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. రోజు రోజుకి అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా చత్తీస్గడ్ లో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడుగురు వ్యక్తులు తనను రేప్ చేయడంతో ఆ మరుసటి రోజు ఒక బాలిక జులైలో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆమె ఎందుకు చనిపోయిందో కూడా తల్లి తండ్రులకు గాని ఎవరికి తెలియలేదు. ఆ తర్వాత ఆమె స్నేహితుడు ఒకరికి చనిపోయే ముందు చెప్పడం... అతను ఆ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులతో అసలు విషయం బయటకు వచ్చింది.

ఇక బాలిక తండ్రి ఆత్మహత్యా యత్నం కూడా చేసాడు. దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం మరణించిన ఆమె మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం కు తరలించారు. బాలిక మృతదేహాన్ని పోలీసు బృందం, తహశీల్దార్ సమక్షంలో బుధవారం శవపరీక్ష కోసం బయటకు తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: