సరిహద్దులో అమెరికా తయారీ.. ఆయుధాలు కలకలం..!

Lokesh
భారత్​-బంగ్లాదేశ్​ సరిహద్దుల్లో ఉగ్రకుట్రలను భగ్నం చేశాయి సరిహద్దు భద్రత బలగాలు(బీఎస్​ఎఫ్). భారీ స్థాయిలో అక్రమ ఆయుధాల తరలింపును బీఎస్​ఎఫ్ అధికారులు ​అడ్డుకున్నారు. మిజోరాం మమిత్​ జిల్లాలో వాటిని స్వాధీనం చేసుకున్నారు.సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించిన బీఎస్​ఎఫ్​ బలగాలు.. అక్రమంగా ఆయుధాలు రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు వాహానాలు, భారీ సంఖ్యలో ఆయుధ సామగ్రి సహా రూ. 39,020 నగదు స్వాధీనం చేసుకున్నారు.

అందులో ఏకే-47, ఏకే 74 తుపాకులు సహా అమెరికాలో తయారైన 7,894 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ముగ్గురు నిందితులు ఐజ్వాల్​లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. వారిలో ఒకరు మయన్మార్ నుంచి వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పూర్తి దర్యాప్తు కోసం రాష్ట్ర పోలీసులకు అప్పగించినట్లు సైన్యాధికారులు స్పష్టం చేశారు. ​

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: