ఏపీలో ఆగని హిందు దేవాలయాలపై దాడులు
చిత్తూరు జిల్లాలోని గంగాధర్ నెల్లూరు మండలం అగరమంగలం లోని ఈశ్వర ఆలయంలో ధ్వంసమైంది నంది విగ్రహం. రాత్రి గుర్తుతెలియని దుండగులు విగ్రహాన్ని రెండుగా ధ్వంసం చేశారని అధికారులు పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల కాలంలో హిందూ ఆలయాలల్లో అనేక అపచార కార్యక్రమాలు పెరుగుతున్నాయి. దీనితో హిందు వాదుల్లో క్రమంగా ఆందోళన పెరుగుతుంది. ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని కోరుతున్నారు.