వాళ్ళతో నేను మాట్లాడతా... వెంకయ్య

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు మీడియా ప్రతినిధుల వీడియో సమావేశంలో పాల్గొన్నారు.  కరోనా, ఇతర అనారోగ్యాల వల్ల‌ మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకి సంతాపం తెలియచేసారు. మా వంతుగా వ్యక్తిగతంగా ఒక్కో‌ కుటుంబానికి రూ.50వేలు ఆర్ధిక సహాయం అందిస్తామని  ప్రకటించారు. జీజీహెచ్ లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ లేవని తెలిసి గత  ప్రభుత్వంతో‌ మాట్లాడాను అని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎంసీఐ గుర్తింపు కోసం గతంలో  మాట్లాడాను అని అవసరం అయితే , మరోసారి చర్చిస్తా అని వెంకయ్యనాయుడు చెప్పారు.

ఇంగ్లీషు నేర్చుకోవాలి కానీ, అమ్మ బాషని మరిచిపోకూడదు. తెలుగు భాష లో ఉన్న ప్రావీణ్యం మరే భాష లోనూ లేద ని ఈ సందర్బంగా తెలియచేసారు. నెల్లూరు జిల్లాలో శంకుస్థాపన చేసిన ప్రతి అభివృద్ధి గురించి చర్చిస్తా అన్నారు. కృష్ణపట్నం - ఓబులాపురం రైల్వే లైను నా చిరకాల వాంఛ అని వెంకయ్య నాయుడు అన్నారు. శ్రీకాళహస్తి - నడికుడి రైల్వే లైను పనుల గురించి రైల్వే అధికారులతో‌ చర్చిస్తాను అని చెప్పారు. రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపైనా దృష్టి సారించాలి. అందుకు కేంద్రం తోడ్పాటు అందివ్వాలని ప్రధాని‌‌మంత్రిని కోరాను అని వెంకయ్య నాయుడు అన్నారు . కరోనా రంగం వల్ల అన్ని రంగాలూ దెబ్బతిన్నా, వ్యవసాయ రంగమే ఉత్పత్తి సాధిస్తుంది అని వెంకయ్య నాయుడు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: