ఎంపి లకు కరోనా పరీక్షలు తప్పనిసరి
కరోనా ప్రబలకుండా పార్లమెంటులో ఎంపి లు కూర్చునే సీట్లలో మార్పులు చేసినట్టు పార్లమెంటు అధికారులు వెల్లడించారు. కొత్తగా ఇప్పుడు పార్లమెంటు సమావేశాలకు హాజరు అయ్యే ప్రతి ఒక్కరూ సమావేశాలకు 72 గంటల ముందే కరోనా పరీక్షలు చేపించుకోవాలి అని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ నిర్ణయంతో పార్లమెంటు ఎంపి లు అందరూ కరోనా పరీక్షలకు సిద్దమవుతున్నారు.