గుడ్ న్యూస్ : రేపటి నుండి బస్ సర్వీస్ లు
అన్ని చోట్లా ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ కి ఇంకా అనుమతులు ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇంట్రా - స్టేట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలో తప్ప. అక్కడ కేసులు భారీగా ఉండడంతో ఇప్పటిదాకా బస్సులకి అనుమతులు ఇవ్వలేదు. అయితే రేపటి నుండి జిల్లాల మధ్య బస్సు సర్వీసులు నడపనున్నట్టు ఆ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి అనిల్ పరబ్ పేర్కొన్నారు. అయితే ప్రైవేటు బస్సులు, వాహనాల మీద ఆంక్షలు కొనసాగుతాయన్న ఆయన పాస్ లేకుండా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.