నీటిలో దూకి బాలికలను రక్షించిన దేశాధ్యక్షుడు
స్థానికంగా ప్రజలతో మాట్లాడుతూ కనిపిస్తుంటారు. ఇటీవల ఓ స్టోర్లో మాస్కు వేసుకుని క్యూలో నిలుచున్న డిసౌజా ఫొటో వైరల్గా మారింది. డిసౌజాకు ఈతలో మంచి ప్రావీణ్యం ఉంది. తరచూ తన ఇంటి సమీపంలోని బీచ్లో సరదాగా గడుపుతారు.డిసౌజా స్కూల్ స్థాయి నుంచే స్విమ్మింగ్ పోటీలో సైతం పాల్గొనేవారు. అత్యవసర సమయంలో మనకు వచ్చిన విద్యను చూపించడం పెద్ద విషయం కాదని డిసౌజా అన్నారు. ఏ దేశాధ్యక్షుడి కి లేని విధంగా డిసౌజాకు ఓ గుర్తింపు ఉంది అతి సామాన్యుడు వలే గడిపే జీవన విధానం ఆయన సొంతం.