అరుదైన మైలురాయి అందుకున్న మోదీ.... ట్విటర్‌ ఖాతాలో ఆయన ఫాలోవర్స్ ఎంతమందంటే....?

Reddy P Rajasekhar

ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ రాజకీయ, పాలనాపరమైన విషయాలను ప్రజలతో పంచుకుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా మోదీ అరుదైన మైలురాయిని అందుకున్నారు. ట్విటర్‌ ఖాతాలో 60 మిలియన్ల (6 కోట్లు) మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అత్యధికంగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీ ​మూడో స్థానంలో నిలిచారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా 120 మిలియన్‌ ఫాలోవర్స్‌తో తొలి స్థానంతో ఉన్నారు. 
 
ప్రస్తుత యూఎస్‌ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 83 మిలియన్‌ ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉండగా మోదీ మూడో స్థానంలో నిలిచారు. అరుదైన ఘనతను సాధించినందుకు నెటిజన్లు మోదీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు మోదీ ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. భారతదేశంలో ఏ ఇతర రాజకీయ నాయుకుడికి లేని ఫాలోవర్స్‌ను మోదీ దక్కించుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: