కరోనా భయం అక్కర్లే... 20 నిమిషాల్లో వైరస్ సోకిందో లేదో తెలుసుకునే అవకాశం....?
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా పరీక్షలకు ఎక్కువ సమయం పడుతూ ఉండటంతో కొందరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యేలోపే వైరస్ వ్యాప్తి చెంది పరిస్థితి విషమిస్తోంది. అయితే తాజాగా ఆస్ట్రేలియాలోని పరిశోధకులు ప్రపంచంలో మొట్టమొదటి సారిగా కరోనా సంక్రమణను కనిపెట్టే విషయంలో పురోగతి సాధించారు. మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 20 నిమిషాల్లో వైరస్ సోకిందో లేదో తెలుసుకునేలా పరీక్షను కనిపెట్టారు.
ఈ పరిశోధన బృందానికి బయోప్రియా, మోనాష్ విశ్వవిద్యాలయ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం నాయకత్వం వహించాయి. రక్త నమూనాల నుంచి 25 మైక్రో లీటర్ల ప్లాస్మాను ఉపయోగించి కరోనావైరస్ కలిగించే ఎర్ర రక్త కణాల క్లస్టరింగ్ ద్వారా వైరస్ వ్యాప్తిని గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇకపై ప్రజలు కరోనా లక్షణాలు కనిపిస్తే 20 నిమిషాల్లో వైరస్ సోకిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.