మహేష్ ప్రశంసించాడంటే.. ఆ సినిమాలో ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది..?

praveen

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏదైనా నచ్చింది అంటే ఫ్రాంక్ గా చెప్పేస్తూ  ఉంటాడు. అయితే తాజాగా సూపర్ స్టార్  మహేష్ బాబు తమిళ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అశోక్ సెల్వన్, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా... విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన సినిమా 'ఓ మై కడవులే'.. అశ్వత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా... మంచి విజయాన్ని అందుకోవడమే కాదు.. ప్రశంసలు సైతం అందుకుంటుంది. ఎంతో మంది హీరోలు సైతం ఈ సినిమాకి ఫిదా అవుతున్నారు. 

 

 తాజాగా సూపర్ స్టార్  మహేష్ బాబు  'ఓ మై కడుపులే' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. డైరెక్టర్ అశ్వత్ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు,  నటులు అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు అంటూ ప్రశంసించారు . సూపర్ స్టార్ ప్రశంసలు అందుకున్న ఆ డైరెక్టర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మహేష్ ప్రశంసల పై స్పందించిన డైరెక్టర్ అశ్వత్ సహ చిత్రబృందం మహేష్ బాబుకి  కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ సినిమాను  తెలుగులో కూడా త్వరలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా మహేష్ ప్రశంసించాడు అంటే నిజంగానే ఆ సినిమాలో ఏదో ఉండే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: