కర్ణాటకకు సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు..?

praveen

రాజస్థాన్ రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ డిప్యూటీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కీలక నేత అయిన సచిన్ పైలట్  తిరుగుబాటు చేయడం ఆయనతో పాటు 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలకడంతో ప్రస్తుతం రాజస్థాన్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో  రాజస్థాన్ రాజకీయాల్లో  రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇక తాజాగా మరో సరికొత్త ఆరోపణను  రాజస్థాన్ కాంగ్రెస్ తెరమీదకు తెచ్చింది. 

 

 ప్రస్తుతం సచిన్ పైలెట్ కు మద్దతుగా కాంగ్రెస్ పై  తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలను కర్ణాటక కు తరలించారు అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. ముందుగా సచిన్ పైలెట్ వర్గాన్ని మొత్తం బిజెపి పాలిత రాష్ట్రమైన హర్యానాలో క్యాంపులో ఉంచగా... రాజస్థాన్ పోలీసులు గజేంద్ర సింగ్ షెకావత్ ఆడియో టేపుల వ్యవహారంలో ప్రశ్నించేందుకు వెళ్ళేసరికి అక్కడ నుంచి వారిని మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకకు తరలించారు అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: