ప్లాస్మా దానానికి ముందుకు రండి : తమిళసై
ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ నుంచి కోరుకున్నవారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలి అంటూ ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి సహా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేయడం వల్ల వేరొకరికి ప్రాణాలను కాపాడినవారం అవుతాము అంటూ తెలిపారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. ఇక తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కూడా...కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలి అంటూ పిలుపునిచ్చారు.
సనత్ నగర్ లో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి ని సందర్శించి
..అక్కడి రక్తదాన కేంద్రాన్ని కూడా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్లాస్మా దానం వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చు... అందుకే ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానానికి ముందుకు రావాలంటూ కోరారు. ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా రోగులను రక్షించేందుకు వీలుందని తమిళిసై తెలిపారు. అందుకే కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్లాస్మా దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.