పూరి ట్విట్ పై స్పందించిన ఛార్మి కౌర్.. ఆసక్తికర రిప్లై..?
ఇస్మార్ట్ శంకర్ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత ప్రభంజనం సృష్టించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా విడుదలై సరిగా ఈరోజుకి సంవత్సరం పూర్తయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్.. గత సంవత్సరం క్రితం ఈ సమయంలో పండగ వాతావరణం నెలకొంది... తనతో పాటు సహనిర్మాతగా పనిచేసిన చార్మి కి కృతజ్ఞతలు అంటూ పూరి జగన్నాథ్ సోషల్ మీడియా వేదికగా ఒక ట్విట్ పెట్టారు.
ఇక తాజాగా పూరి జగన్నాథ్ ట్విట్ పై స్పందించిన ఛార్మి కౌర్... అవును డైరెక్టర్ గారు గత సంవత్సరం క్రితం ఇది పండుగ వాతావరణమే.. మీరు నాకు ఇచ్చిన ప్రతి దానికి కృతజ్ఞతలు
.. మీకు మరిన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు రాబోయే రోజుల్లో రావాలని కోరుకుంటున్నాను.. 10 సంవత్సరాల పాటు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాలని కోరుకుంటున్నాను అంటూ ఛార్మి కౌర్ ఒక ట్విట్ పెట్టారు.
Yessssssss director garu 😁
Thanks for everything 💃🏼
Many more blockbusters coming our way ..
next 10 years ki back to back scripts and blockbusters r getting ready 💪🏻@purijagan @PuriConnects rocks 😁#PCfilm 😁 https://t.co/ltQPfyepFH — Charmme Kaur (@Charmmeofficial) July 18, 2020