మాస్కు తప్పని సరి చేసిన జగన్ సర్కార్..?

praveen

ప్రస్తుతం కరోనా  వైరస్ విజృంభిస్తున్న  నేపథ్యంలో ప్రతి ఒకరు కరోనా  వైరస్ మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్ వాడడం ఎంతో కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంత మంది ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా  వైరస్ వ్యాప్తికి కారకులుగా మారిపోతున్నారు. అయితే తాజాగా దీనిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా  పోరాటంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్  తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది  జగన్ సర్కార్. 

 ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్. బహిరంగ ప్రదేశాలు సహా పనిచేసే ప్రదేశాలు ప్రయాణాలు ఇలా ప్రతి చోట కూడా ఖచ్చితంగా మాస్క్  వినియోగించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కూడా మాస్క్  తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: