కరోనా కట్టడిపై కేసిఆర్ సమీక్ష..?
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి వైరస్ కేసులు మాత్రం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజానీకం తీవ్ర స్థాయిలో ఆందోళన కలుగుతుంది. అయితే తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
ప్రగతిభవన్లో ఆరోగ్యశాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కొత్తగా హెల్త్ సెక్రటరీ నియామకం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారి సమీక్ష చేస్తుండగా ఈ సమీక్ష కు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సిఎస్ సోమేష్ కుమార్, ఆరోగ్య కార్యదర్శి రిజివి, ఇతర విభాగాల ముఖ్య అధికారులు సీఎం సమీక్ష లో పాల్గొన్నారు. అయితే సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.