సరిహద్దుల్లో భారత ఆర్మీ విన్యాసాలు

భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ లడఖ్ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో సాయుధ దళాలతో ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇక  సరిహద్దుల్లో చైనా ఆర్మీ కదలికలకు సంబంధించి కూడా ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటారు. ఇదిలా ఉంటే ఆయన పర్యటనలో భాగంగా సరిహద్దుల్లో బలగాలు వ్యాయామ కార్యక్రమాలు నిర్వహించాయి. 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే సమక్షంలో భారత సాయుధ దళాల దళాలు లడఖ్ సరిహద్దుల్లో పారా డ్రాపింగ్  విన్యాసాలు చేసారు.  అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది అని  భారత బలగాలు చెప్తున్నాయి. క్షేత్ర స్థాయిలో సరిహద్దుల్లో ఆయన పరిశీలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: