బెజవాడ డ్రగ్స్ కేసులో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు..?
బెజవాడలో డ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు విదేశీయులు పట్టుబడడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెజవాడ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతకు డ్రగ్స్ అమ్మకంలో కోనేరు అర్జున్ కీలక పాత్రధారిగా ఉన్నట్టు తాజాగా విచారణలో తెలుస్తోంది. అంతేకాకుండా సూడాన్ కి చెందిన రసూల్, టాంజానియా కు చెందిన యోనా నుండి కొని కాలేజీ విద్యార్థులకు అర్జున్ లాభానికి అవుతున్నట్లు సమాచారం.
పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన అర్జున్.. అప్పటి పరిచయాలతో నే ఇతర కళాశాలలోని విద్యార్థులతో పరిచయాలు పెంచుకుని డ్రగ్ అమ్మకాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అర్జున్ దగ్గర డ్రగ్ తీసుకున్న వారిని విచారించేందుకు ప్రస్తుతం బెజవాడ పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా విదేశీయుల విసా లను సీజ్ చేసేందుకు పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.