హోమ్ క్వారంటైన్ లో బీసిసిఐ అధ్యక్షుడు..?

praveen

ఇటీవలే బిసిసిఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుటుంబంలో కరోనా  వైరస్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న సౌరవ్ గంగూలీ కుటుంబానికి సంబంధించిన కొంత మంది వ్యక్తులు  వైరస్ బారిన పడగా తాజాగా.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గంగూలి  సోదరుడు స్నేహశీష్  కరోనా  వైరస్ బారిన పడడంతో ప్రస్తుతం గంగూలీ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

 

 గత కొన్ని రోజుల నుండి గంగూలీ సోదరుడు స్నేహశిష్  జ్వరంతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉండగా ఆయనకు కరోనా  పరీక్షలు నిర్వహించారు వైద్య సిబ్బంది. దీంతో పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ కాగానే బెల్లి  వ్యూ  ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో గంగూలీ కూడా కొన్ని రోజులపాటు గృహ నిర్బంధంలో ఉండనున్నట్లు  తెలుస్తోంది. ఇటీవలే ఓ  మీడియా ఛానల్ తో మాట్లాడిన గంగూలీ వైరస్ తో జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: