గోవాలో ఆగస్టు 10 వరకు కర్ఫ్యూ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం..?

praveen

దేశంలో కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో అయితే ఈ మహమ్మారి వైరస్ ప్రభావం మరింతగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర పరిధిలోని పలు ప్రాంతాల్లో సంపూర్ణంగా లాక్ డౌన్  విదిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు రాత్రివేళల్లో కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నాయి. 

 

 తాజాగా గోవాలో ఆగస్టు 10 వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు తాజాగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటన విడుదల చేశారు. కర్ఫ్యూ  సమయంలో కేవలం వైద్య సేవలు మినహా మిగతా అన్ని రకాల సేవలకు  నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: