బ్రేకింగ్ : కజికిస్తాన్ లో వెలుగులోకి మరో కొత్త రోగం... కరోనా కంటే ప్రమాదకరం అని చెబుతున్న శాస్త్రవేత్తలు....?

Reddy P Rajasekhar

కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనాలో ఇప్పటికే ప్రాణాలను హరించే కొత్తకొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే చైనా ప్రజలను జీ4, బుబోనిక్ ప్లేగు లాంటి వైరస్ లు భయాందోళనకు గురి చేస్తుండగా తాజాగా కజికిస్తాన్ లో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని న్యూమోనియా వైరస్ తో అక్కడ ప్రజలు మరణిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి అక్కడ 1,772 మంది మృతి చెందారని తెలుస్తోంది. ఒక్క జూన్ నెలలోనే 628 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. 
 
అయితే ఈ వైరస్ కరోనా కంటే ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కజఖిస్తాన్ నుంచి చైనాలోకి ఆ వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని చైనా వైద్య నిపుణులు కోరారు. చైనా రాయబార కార్యాలయం నుంచి వెలువడిన ఈ ప్రకటన ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: