సూపర్ ఎలిమెంట్స్ యాప్ ప్రారంభించిన ఉప రాష్ట్రపతి...
తొలి దేశీయ సోషల్ మీడియా సూపర్ ఎలిమెంట్స్ యాప్ ను తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అయితే గురు పౌర్ణమి రోజున ఈ యాప్ను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ తెలిపారు రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
ఆత్మ నిర్బర్ భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రస్తుతం మేడిన్ ఇండియా పై అన్ని ప్రాంతాల్లో చైతన్యం వచ్చిందని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు