చైనాకు మోదీ ఘాటు హెచ్చరిక.... భారత్ జోలికి వస్తే ఊరుకోబోమని వ్యాఖ్యలు....?
ప్రధాని మోదీ చైనాకు లేహ్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. మోదీ మాట్లాడుతూ అవసరమైతే వీరత్వం చూపిస్తామని... బలహీనులు శాంతి సాధించలేరని... బలమైన వాళ్లు మాత్రమే శాంతి సాధించగలరని వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ కోసం ఆధునిక అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.భారత సైనికుల సామర్థ్యం హిమాలయంత గొప్పదని... 130 కోట్ల మంది భారతీయులు ఒకే సంకల్పంతో ఉన్నారని చైనాను హెచ్చరించారు.
లేహ్ నుంచి సియాచిన్ దాకా భారత్ సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని అన్నారు. ప్రపంచ శాంతి కోసం భారత్ చేయాల్సిందంతా చేస్తుందని... సైనికుల సాహసాలు అజరామరం అని చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానాన్ని భారత్ లో అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మోదీ పేర్కొన్నారు. లద్దాఖ్ ప్రజలు ఎల్లప్పుడూ సైనికుల వెంట ఉంటారని భారత్ జోలికి వస్తే ఊరుకోబోమని అన్నారు.