టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు షాక్... అనుమతుల్లేకుండా 18 కోట్ల రూపాయలు విత్ డ్రా....?
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు మరో షాక్ తగిలింది. టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి అనుమతుల్లేకుండా ఆయన పెద్దఎత్తున నిధులను ఉపసంహరించినట్టు ఈడీ అధికారుల విచారణలో తేలింది. ఈడీ దీనిపై కేసు నమోదు చేసింది. నిధులను ఉపసంహరించినట్టు టీవీ9 ప్రతినిధులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబర్ లో రవి ప్రకాష్ పై కేసు నమోదైంది.
ఈ కేసు ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఆరోపణలు నిజమేనని తేలడంతో తాజాగా ఈడీ రవిప్రకాష్ పై కేసు నమోదు చేసింది. ఒకప్పుడు టీవీ9 సీఈవోగా గుర్తింపు తెచ్చుకున్న రవిప్రకాష్ కు ప్రస్తుతం వరుస షాకులు తగులుతూ ఉండటం గమనార్హం.