వైసీపీ ఎంపీకి జగన్ షాక్.... అనర్హత వేటు వేసే ఆలోచనలో పార్టీ అధిష్టానం...?

Reddy P Rajasekhar

గత కొన్నిరోజులుగా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి వైసీపీ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. రఘురామ జగన్ పై నేరుగా విమర్శలు చేయకపోయినా పార్టీ ఎమ్మెల్యేలపై, పార్టీలో అవినీతి జరుగుతోందని పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించారు. కొన్నిరోజుల క్రితం వైసీపీ షోకాజ్ నోటీస్ జారీ చేస్తే ఆ నోటీస్ తమ పార్టీ నోటీస్ కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 
 
అనంతరం మీడియా ముందు మాత్రం జగన్ కు తనపై కోపం లేదని.... సీఎంను కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నానని వ్యాఖ్యలు చేశారు. పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేలా వ్యవహరిస్తున్న రఘురామ విషయంలో సైలెంట్ గా ఉంటే మంచిది కాదని భావించిన జగన్ లోక్‌సభ స్పీకర్‌కు అనర్హత పిటీషన్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: