
బ్రేకింగ్ : అదనంగా మరో 3 వేల మందికి శ్రీవారి దర్శనం.,?
కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు పరిమిత సంఖ్యలోనే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అనుమతి లో మరి కొంత మినహాయింపు ఇస్తూ మరో 3 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.
దీనికోసం ఈరోజు నుంచి పదివేల ఆన్లైన్ టికెట్లతో పాటు అదనంగా మరో మూడు వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. అయితే కరోనా వైరస్ కారణంగా 20 రోజులు శ్రీవారి ఆలయం మూతపడడంతో ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న విషయం తెలిసిందే.