నిరుద్యోగులకు శుభవార్త.... పరీక్ష లేకుండానే ఎస్బీఐలో ఉద్యోగం...?

Reddy P Rajasekhar

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా ఎస్బీఐ 444 స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎలాంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. జులై 13వ తేదీలోపు ఎస్బీఐ వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ కమిటీ అభ్యర్థులను షార్ట్ చేసి 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. 
 
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు వెబ్ సైట్ లో రెజ్యూమ్, గుర్తింపు కార్డు, సర్టిఫికెట్లకు సంబంధించి పత్రాలు, అనుభవానికి సంబంధించిన పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్హత మార్కుల ఆధారంగా ఉద్యోగుల ఎంపిక జరుగుతుంది. ఏ ఇద్దరికైనా మార్కులు సమానంగా వస్తే వయసు ఆధారంగా ఎంపిక చేస్తారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: