జవాన్ల కుటుంబాలకు తక్కువ చేస్తే దేశద్రోహమే.... మన్మోహన్ సంచలన వ్యాఖ్యలు...?

Reddy P Rajasekhar

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చైనాతో వివాదం గురించి పూర్తి సమాచారం బయట పెట్టాలని కోరారు. సమాచారం దాచడం సమర్థ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాదని... చైనాతో సమస్య ముదరకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చైనా సైనికులతో జరిగిన ఘర్షణకు సంబంధించి కేంద్రం నిజాలను దాచిపెడుతోందని... సరైన సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు. కేంద్రం నిజానిజాలను ప్రజల ముందుంచాలని వ్యాఖ్యలు చేశారు. 
 
అమరవీరుల త్యాగాలను వృధాపోనీయకూడదని.... జవాన్ల త్యాగాలకు కేంద్రం న్యాయం చేయాలని చెప్పారు. అమరజవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. గాల్వాన్ లో మరణించిన సైనికులకు న్యాయం జరిగేలా చూడాలని... అలా చేయకపోతే ప్రజల విశ్వాసానికి ద్రోహం చేసినట్టేనని పేర్కొన్నారు. మనం ప్రస్తుతం చరిత్రాత్మకమైన కూడలి వద్ద నిలబడ్డామని.... ప్రభుత్వ నిర్ణయాలు భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: