చిన్నప్పటి నుంచీ ఒకే ఆలోచనతో పోరాడుతున్నా : రాహుల్
బాలీవుడ్ ప్రముఖ నటుడైన రాహుల్ ఖన్నా ఈ రోజూ తన 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు పలువురు సెలబ్రిటీలు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా శ్వేత బచ్చన్ రాహుల్ కన్నా త్రో బ్యాక్ ఫోటోని షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక తన బర్త్ డే సందర్భంగా రాహుల్ కన్నా పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. చిన్నప్పుడు బర్త్ డే వేడుకల్లో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఇప్పటికికూడా కేక్ ఎలా తినాలో తెలియదు.. దాని కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం అంటూ కామెంట్ పెట్టాడు రాహుల్ కన్నా. అంతేకాకుండా భారతదేశంలో నిరాశ్రయులుగా ఉంటూ దుర్భర జీవితం గడుపుతున్న పిల్లల ముఖాల్లో ఇలాంటి నవ్వు చూడడానికి సహాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేశాడు. దీంతో రాహుల్ కన్నా సందేశం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Still trying to figure out how to have my cake and eat it, too. #geminibaby 🎂
If you’d like to help put a smile like this on the data-face of one of India’s most vulnerable children, here’s a great place to start: @CRYINDIA pic.twitter.com/osGSswOmv6 — rahul khanna (@R_Khanna) June 20, 2020