నకిలీ విత్తనాల గుట్టు రట్టు చేసిన పోలీసులు..?

praveen

ఈ మధ్యకాలంలో నకిలీ విత్తనాలు బెడద ఎక్కువైపోయిందన్న  విషయం తెలిసిందే. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ  విత్తనాల గుట్టురట్టు చేస్తున్నారు. తాజాగా మరోసారి భూపాలపల్లి పోలీసులు భారీ మొత్తంలో నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. 10 లక్షల విలువచేసే 5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు భూపాలపల్లి పోలీసులు. 

 

 గణపురం మండలం వేల్పూరు డి జంక్షన్ వద్ద వరంగల్ నుంచి భూపాలపల్లి వైపు వస్తున్న ఐ20 కార్ ను పోలీసులు తనిఖీ చేశారు. దీంతో ఆ కారులో ఏకంగా పది లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు దొరికాయి. ఇక అవి నకిలీ విత్తనాలు అని వ్యవసాయ అధికారి ధ్రువీకరించడం తో... కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులతో పాటు సదరు నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల నుంచి ఐదు సెల్ఫోన్లు సీజ్ చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: