దళిత పెళ్లికొడుకుకి అవమానం..?
ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల కుల వివక్ష అనేది జరుగుతూనే ఉంటుంది అనే విషయం తెలిసిందే. దళితులను చిన్నచూపు చూసే వాళ్ళు ఇప్పటికికూడా ఉన్నారు. తాజాగా ఇక్కడ ఓ దళిత పెళ్ళికొడుకు కి తీరని అవమానం జరిగింది. ఏకంగా పెళ్లి ఊరేగింపులో అవమానం జరగడం సంచలనంగా మారిపోయింది.
మధ్యప్రదేశ్ చతర్పూర్ లో ఈ ఘటన జరిగింది. చతర్పూర్ లోని సతై ప్రాంతంలో సోమవారం ఒక దళిత వరుడు ని యాదవ సంఘం గుర్రపుస్వారీ చేయకుండా ఆపేసింది. కొంతమంది గుర్రం యొక్క తాడు లాగడంతో గుర్రం పై ఉన్న వరుడు ఒక్కసారిగా నేల మీద పడిపోయాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైనట్లు.. సతాయ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో దీపక్ తెలిపారు.