బ్రేకింగ్ : స్టార్ డైరెక్టర్ కు గుండెపోటు..పరిస్థితి విష‌మం.?

Reddy P Rajasekhar

మలయాళ సినిమాల రచయిత, దర్శకుడు కేఆర్​ సచిదానంద‍న్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. దర్శకునికి గుండెపోటు రావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య‌ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. త్రిశూర్ లోని ప్రముఖ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స జరుగుతోంది. ఇప్పటికే సచిదానందన్ కీళ్ల సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారని తెలుస్తోంది. 
 
ఇటీవల ఆయనకు హిప్ సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. 2015లో విడుదలైన ‘అనార్కలి మూవీతో డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇచ్చిన సచిదానందన్ ‌ స్టార్​ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బిజూ మేనన్‌ నటించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్’ చిత్రాన్ని తెర‌కెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిప్ సర్జరీ నుంచి కోలుకుంటున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ అయినట్టు మాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: